ప్రాణం తీసిన మాస్కు..!

మాస్కు ధరిచకపోవడంతో గత శనివారం చీరాల ఎస్సై  కిరణ్ కుమార్ అనే యువకుడిని చితకబాదాడు. ఈ ఘటనలో  అపస్మారక స్థితిలోకి వెళ్లిన కిరణ్ ప్రాణాలు వదిలాడు. వివారాల మేరకు గత శనివారం చిరాలలోని థామస్ పేటకు చెందిన మోహనరావు రేషన్ డీలర్ గా పనిచేస్తున్నాడు. అతని రెండో కుమారుడు కిరణ్ కుమార్ స్నేహితుడు షైనీ అబ్రహంతో కలిసి ద్విచక్రవాహనంపై కొత్తపేట వెళ్లి వస్తుండగా కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న చెక్ పోస్టు సమీపంలో ఎస్సై విజయకుమార్ వీరిని ఆపారు. కిరణ్ కుమార్ మాస్కు పెట్టుకోకపోవడంతో ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరన్ కుమార్ తలపై లాఠీతో తీవ్రంగా కొట్టడంతో అతడు అపస్మారక స్థతిలో వెళ్లిపోయాడు.  

దీంతో కిరణ్ కుమార్ కు  మెరుగైన వైద్య సహాయం కోసం GGH కి తరలించారు. అయితే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని, ఇక్కడ సరైన వైద్యం అందించలేమని, గుంటూరులోని సిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. సిటీ హాస్పిటల్ లో రెండు రోజులు పాటు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని, మరో చోటుకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో మరో ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. కిరణ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఊహించని  విధంగా  ప్రాణాలు కొల్పవటంతో  తల్లిదండ్రులు  రోదన వర్ణనాతీతం.  

 

Leave a Comment