భారత్ లో ఇంగ్లండ్ జట్టు పర్యటన షెడ్యూల్.. టీమిండియా జట్టు ఇదే..

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. బ్రిస్బేన్ స్టేడియంలో 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓటమి రుచి చేసింది. నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడనుంది. భారత్ లో జరగనున్న ఈ సుదీర్ఘ సిరీస్ లో టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు జరగనున్నాయి. 

సిరీస్ షెడ్యూల్ ఇదే..

టెస్టు సిరీస్ : 

ఫిబ్రవరి 5 – తొలి టెస్టు – చెన్నై

ఫిబ్రవరి 13 – రెండో టెస్టు – చెన్నై

ఫిబ్రవరి 24 – మూడో టెస్టు – అహ్మదాబాద్

మార్చి 4 – నాలుగో టెస్టు – అహ్మదాబాద్

టీ20 సిరీస్ :

మార్చి 12 – తొలి టీ20 – అహ్మదాబాద్

మార్చి 14 – రెండో టీ20 – అహ్మదాబాద్

మార్చి 16 – మూడో టీ20 – అహ్మదాబాద్

మార్చి 18 – నాలుగో టీ20 – అహ్మదాబాద్

మార్చి 20 – ఐదో టీ20 – అహ్మదాబాద్

వన్డే సిరీస్ :

మార్చి 23 – తొలి వన్డే – పూణె

మార్చి 26 – రెండో వన్డే – పూణె

మార్చి 28 – మూడో వన్డే – పూణె

ఈక్రమంలో బీసీసీఐ తొలి రెండు టెస్టులకు తుది జట్టును ఖరారు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు తిరిగి జట్టులోకి వచ్చారు. ఆసీస్ తో జరిగిన టెస్టులో విఫలమైన పృథ్వీషాకు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. ఈ సిరీస్ లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ బరిలోకి దిగనున్నారు. 

తొలి రెండు టెస్టులకు భారత జట్టు :

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రిషబ్ పంత్, సాహా, హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.

 

You might also like
Leave A Reply

Your email address will not be published.