అబ్బో.. ప్యాంట్, షర్ట్ ధరించి ముస్తాబైన ఏనుగు..

ఏనుగు ముస్తాబయింది. ప్యాంట్, షర్ట్ ధరించి దర్జాగా తిరుగుతోంది. పర్పుల్ కలర్ షర్ట్, వైట్ ప్యాంట్ తో పాటు బ్లాక్ బెల్టును ధరించి మావటి వెనకాలే వెళ్తోంది. ప్రస్తుతం ఈ ఏనుగుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. 

ఆనంద్ మహీంద్రాకు తన దృష్టికి వచ్చిన సందేశాత్మక, ఫన్నీ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం అలవాటు. అలా ఆయన దృష్టికి వచ్చిన ఒక కొత్త పోస్ట్ లో అందంగా ముస్తాబైన ఏనుగు ఫొటోను షేర్ చేశారు. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా.. ఎలీ – ప్యాంట్’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేసుకుంటున్నారు.  

Leave a Comment