మీకు గురక సమస్య ఉందా..ముక్కలో ఈ డివైజ్ పెట్టుకుంటే చాలు..!

మనలో చాలా మందికి నిద్రలో గురక పెడుతుంటారు. ఈ సమస్య వల్ల వారి చుట్టుపక్కల ఉన్న వారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అయితే వారు మాత్రం హాయిగా నిద్రపోతుంటారు. నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం, వదలడం చేసినప్పుడు మన మెడ, తలలోని మృదు కణజాలంలో కంపనల వల్ల మనం గురకపెడుతుంటాం. ఈ మృదు కణజాలం మన ముక్కు రంధ్రాల, టాన్సిల్స్, నోటి పైభాగంలో ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో వాయు మార్గం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో గాలి చాలా బలవంతంగా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.

గురక వల్ల పక్కన వారికి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. దీనిని చెక్ పెట్టేందుకు ‘ఎలక్ట్రానిక్ యాంటీ స్నోరింగ్ డివైజ్’ మార్కెట్ లోకి వచ్చేసింది. గురక సమస్య ఉన్న వారు నిద్రపోయేటప్పుడు ఈ ఎలక్ట్రానిక్ యాంటీ స్నోరింగ్ డివైజ్ ని ముక్కు రంధ్రాలకు పెట్టుకోవాలి. ఇది స్వచ్ఛమైన గాలిని లోపలికి పంపించడంతో పాటు శ్వాసకు ఇబ్బంది పడకుండా చేస్తుంది. దీంతో సౌండ్ లేకుండా నిద్రపోతారు. 

ఈ డివైజ్ లో యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ హానీకరమైన వాయువులను, దుమ్ము, ధూళిని సమర్థవంతంగా అరికట్టి, ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. మార్కెట్ లో ఈ ఎలక్ట్రానిక్ యాంటీ స్నోరింగ్ డివైజ్ లభ్యమవుతున్నాయి. బ్యాటరీలతో నడిచేవి, చార్జింగ్ పెట్టుకునేవి రెండు రకాలుగా ఇది దొరుకుతుంది. దీని ధర మార్కెట్ లో 9 డాలర్లు అంటే రూ.672 ఉంది. మోడల్ ని బట్టి ధరల్లో తేడా ఉంటుంది. అయితే ఈ  కొనేటప్పుడు క్వాలిటీ, రివ్యూలు చూసి కొనడం మంచిది. చార్జింగ్ పెట్టుకునే డివైజ్ అయితే మన్నిక బాగుంటుంది. 

Leave a Comment