రైతులకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమే : సీఎం జగన్

ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పధకానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు సాగు తాగునీటి సమస్య పరిష్కారానికి, రాయలసీమ కరువు నివారణ పథకానికి ఆమోదముద్ర వేసింది. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో గురువారం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ రైతులకు అందే విద్యుత్ ఎప్పకిటీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. 

ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం పడదని హామీ ఇచ్చారు. వచ్చే 30-35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద బ్యాంక్ ఖాతా ఉంటుందని, కరెంటు బిల్లు డబ్బు అందులో నేరుగా జమ చేస్తామని తెలిపారు. ఆ డబ్బునే రైతులు డిస్కంలకు చెల్లిస్తారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పేర్కొన్నారు.

 

Leave a Comment