విషాదం.. కరెంట్ షాక్ తో కుటుంబంలో ఆరుగురు మృతి..

కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లోని ఛాతర్ పూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. బీజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాజ్వాలా గ్రామంలో ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం జరుగుతోంది. ఈక్రమంలో పైకప్పు స్లాబ్ వేయడానికి ఉపయోగించే షట్టర్ ప్లేట్లను తొలగించడానికి ఆ ఇంట్లోని ఒకరు ట్యాంక్ లో దిగారు. 

ట్యాంక్ లో లైటింగ్ ఏర్పాట్ల కారణంగా, కరెంట్ ఆ పలకలపైకి వ్యాపించింది. దీంతో ఆ వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది. అతడిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఐదుగురు కుటుంబ సభ్యులు కూడా కరెంట్ షాక్ కు గురయ్యారు. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  

Leave a Comment