మంటల్లో కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎలక్ట్రిక్ వాహనాలు సేఫేనా? 

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. చమురు ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలపై వైపు ప్రజలు చూస్తున్నారు. వాటి అమ్మకాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. ఈక్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు అసలు సేఫేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతుండటమే కారణం.. 

గత కొద్ది రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు.. తాజాగా చెన్నైలో ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి.. వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతుండటంతో ఈ వాహనాల భద్రతపై కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. 

చెన్నైలో మంటలు చెలరేగుతున్న ప్యూర్ ఈవీ స్కూటర్ వీడియోను ‘ది ఎకనామిక్ టైమ్స్’ కి చెందిన సుమంత్ బెనర్జీ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో రద్దీగా ఉండే రహదారి పక్కన పార్క్ చేసిన ఎరుపు ప్యూరీ ఈవీ స్కూటర్ నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో కొద్ది సేపు ట్రాఫిక్ ఆగిపోయింది. ఇలాంటి ఘటనలు 4 రోజుల్లో నాలుగు జరిగినట్లు సుమంత్ బెనర్జీ పేర్కొన్నారు. 

Leave a Comment