అధిక ఏకగ్రీవాలను ఒప్పుకోం : నిమ్మగడ్డ

అధిక ఏకగ్రీవాలను ఒప్పుకునేది లేదని, నామ మాత్రంగా మాత్రమే అనుమతిస్తామని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. గురువారం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో లాగా లోపాలు లేకుండా ఎన్నికలు జరపాలని, స్థానిక సంస్థలు బలంగా ఉండాలని అనేది తన అభిప్రాయమని అన్నారు. 

ఎన్నికలకు ఇది సరైన సమయమని భావించి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు ఎన్నికలు జరుపుకోమని ఆదేశించిందని, అందరూ కలిసి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని కోరారు. ప్రజారోగ్యం దృష్ట్యా గతంలో రెండు విడతలు జరిగే ఎన్నికలు, ప్రస్తుతం నాలుగు విడతలుగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. 

ఏకగ్రీవాలు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోతున్నాయన్నారు. నాయకత్వం వహించాలని భావించే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఒక్కో పంచాయతీలో ఐదారు మంది పోటీపడుతున్నారని, బలవంతపు ఏకగ్రీవాలు జరిగితే అధికారుల వైఫల్యమవుతుందని తెలిపారు. ఎన్నికల వల్ల గ్రామాల్లో విభేదాలు వస్తాయనడం సరికాదన్నారు. 

తన జీవితంలో ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గచూపలేదన్నారు. తనది చిన్న పరిధి అని, తన పరిధి దాటి ఏనాడూ ప్రవర్తించలేదని అన్నారు. పాదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం తన బాధ్యత అన్నారు. రాజకీయ పార్టీలన్నింటినీ గౌరవిస్తానన్నారు. తాపే ట్రైనీ ఐఏఎస్ గా నెల్లూరు జిల్లాలో పనిచేశానని, నెల్లూరు జిల్లా నుంచి అదే గౌరవాన్ిన నేర్చుకున్నానని స్పష్టం చేశారు. 

Leave a Comment