ఏకగ్రీవం కోసమే ఎన్నికలు : కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు : అధికార వైసీపీ పొగరుబోతు ఎద్దులా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా దిక్కులేదని మండిపడ్డారు. బీజేపీ, జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ చేసే అభ్యర్థుల్ని బూతులు తిడుతున్నారని, విత్‌డ్రా చేసుకోకపోతే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతటి దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా, ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఏకగ్రీవం కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తు్న్నారని ఆయన విమర్శించారు. నెల్లూరులో అయితే మహిళలపై కత్తులతోనే దాడి చేశారని, గూండాయిజానికి, నియంతృత్వ ధోరణికి బ్రేక్ వేయాలంటే బీజేపీ, జనసేనకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యం, డబ్బు పంచినట్లు ఫిర్యాదులు వస్తే మూడేళ్లు జైలు శిక్ష పడేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డంపెట్టు్కొని వైసీపీ రాష్ట్రంలో  అరాచకాలను సృష్టిస్తోందని కన్నా తీవ్రంగా మండిపడ్డారు.

 

Leave a Comment