నెల్లూరు జిల్లాలో నేలకేసి కొట్టినా పగలని గుడ్లు..!

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ప్లాస్టిక్ కోడి గుడ్లు కలకలం రేపాయి. గుడ్డు నేలకేసి కొట్టినా పగలదు. ఉడకబెడితే లోపలంతా రాయిలా మారుతుంది. మండలంలోని అండ్రవారిపల్లిలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి తెచ్చి గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో కోడి గుడ్లు విక్రయించారు. ఒక అట్ట 100 రూపాయలకు అమ్మారు. తక్కవ ధరకు వస్తున్నాయని ఎక్కువ మంది కొనుగోలు చేశారు. 

ప్రస్తుతం మార్కెట్ లో ఒక్కో కోడిగుడ్డు ధర 6 రూపాయలు ఉంది. 30 గుడ్లు కావాలంటే 180 రూపాయలు అవుతుంది. అలాంటిది 30 గుడ్లు 100 రూపాయలకే అమ్మారు. తక్కువధరకే వస్తున్నాయని జనం ఎగబడి కొన్నారు. క్షణాల్లో ఆటో ఖాళీ అయింది.

అయితే గుడ్లు కొని ఇంటికి వెళ్లి చూడగా గ్రామస్తులు షాక్ అయ్యారు. గుడ్డు పొరపాటున జారి కింద పడిన పగలకపోవడంతో అనుమానాలు వచ్చాయి. ఉడకబెట్టిన ఉడకలేదు. కొన్ని గుడ్లు రాళ్లలా మారిపోయాయి. దీంతో అవి ప్లాస్టిక్ గుడ్లుగా తెలిసిపోయింది. ధర తగ్గించి అమ్మినప్పుడు తక్కువ ధరకు ఎలా అమ్ముతారని ఎవరూ ఆలోచించలేదు. చివరికి మోసపోయినట్లు గ్రహించారు.  

 

Leave a Comment