జనరల్ టికెట్స్ బుక్ చేయడం ఇకపై ఈజీ

రైల్వే శాఖ ప్రయాణికులకు యూటీఎస్ క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా జనరల్ టికెట్లను సులభంగా పొందే అవకశాన్ని కల్పించింది. గతంలోనే యూటీఎస్ యాప్ ద్వారా సెంకడ్ క్లాస్ టికెట్లను బుక్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రయాణికులకు అందుబాటులో తీసుకురాగా, టికెట్ల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో దానిపై ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే యూటీఎస్ క్విక్ రెస్పాన్స్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ప్రధాన నగరాలైన తిరుపతి, గుంటూరు, విజయవాడ, వరంగల్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, హైటెక్ సిటీ, బేగం పేట తదితర ప్రాంతాల్లో ఈ యూటీఎస్ క్యూ ఆక్ కోడ్ సౌకర్యాన్ని తీసుకురానుంది. దశలవారీగా అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రయాణికులు యూటీఎస్ క్యూఆర్ కోడ్ ఉపయోగించి క్షణాల్లో టికెట్లను పొందవచ్చు. అంతే కాకుండా ఈ కోడ్ వల్ల యాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతారని రైల్వే శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, యూటీెఎస్ యాప్ ఉపయోగించి దేశంలో ఎక్కడ నుంచి అయినా జనరల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

Leave a Comment