ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్..!

ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బ్రేకులు పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. దీంతో ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటే ఏపీ సీఎస్ కు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ పథకాలపై గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నా, బడ్జెట్ కేటాయింపులు చేసినా పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేస్తుందంటూ ఎస్ఈసీ సర్క్యూలర్ జారీ చేసింది. 

దీంతో ఇళ్ల పట్టాల పంపిణీ ఉన్నపళంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకానికి కూడా ఎన్నికల కోడ్ అడ్డంగా మారనుంది. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని సోమవారం నెల్లూరులో ప్రారంభించేందుక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా నిమ్మగడ్డ ఉత్తర్వులతో అమ్మఒడి జరుగుతుందా లేదా అనే దానిప ఉత్కంఠ నెలకొంది. 

  

Leave a Comment