ఏపీ ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్ష తేదీలు ఖరారు

లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడ్డ ప్రవేశ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. తాజాగా ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. లాక్ డౌన్ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎంసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్ సెట్, పీజీ సెట్, ఈసెట్ ఆన్ లైన్ దరఖాస్తు గడువును మే 20 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమంచద్రరెడ్డి తెలిపారు. 

ప్రవేశ పరీక్షల తేదీలు

 

ECET24th July 2020
ICET25th July 2020
EAMCET27th July to 31st July 2020
PGECET2nd August to 4th August 2020
EDCET5th August 2020
LAWCET6th August 2020
PECET(feild test only)7th August to 9th August 2020

 

Leave a Comment