ఏప్రిల్ 20 నుంచి ఈ-కామర్స్ కు అనుమతి..

Covid-19  వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా జరగుుతున్న లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే లాక్ డౌన్ సమయంలో కొన్నింటికి సడలింపు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా E-commerce సేవలను అనుమతించనున్నట్లు ప్రభుత్వం బుధవారం తెలిపింది. E-commerce కంపెనీలకు ఈ సడలింపు ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి వస్తుంది. 

Amezon, Flipkart మరియు Snapdeal వంటి E-commerce సంస్థలకు అనుమతి ఉంటుంది. లాక్ డౌన్ వల్ల దుకాణాలు మూసివేయబడినందు వల్ల వస్తువులను కొనుగోలు చేయలేకపోతున్న వారికి ఇలి చాలా ఉపశమనం కలిగిస్తుంది. 

PM Narendra Modi లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా వైరస్ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో మినహాయింపు ఉంటుందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MHA) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 

డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సేవల రంగానికి చాలా కీలకమని, మరియు జాతీయ వృద్ధికి ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం E-commerce కార్యకలాపాలు, IT మరియు IT Enabled Services, ప్రభుత్వ కార్యకలాపాల కోసం డేటా మరియు కాల్ సెంటర్లు మరియు ఆన్ లైన్ బోధన ఇవన్నీ ఇప్పుడు అనుమతించబడ్డాయి. 

E-commerce ఆపేరేటర్లు ఉపయోగించే వాహనాలు అవసరమైన అనుమతులతో నడపడానికి అనుమతించబడతాయి. అయితే కంటైనేషన్ హాట్ స్పాట్లుగా ప్రకటించబడిన ప్రాంతాల్లో సడలింపులు వర్తించవు. 

Leave a Comment