వలస కార్మికురాలిగా దుర్గామాత విగ్రహం..!

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలు చెప్పలేనివి. ఉద్యోగాలు కోల్పోయి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. కాగా వలస కార్మికుల కష్టాలు, బాధలు అందరికీ గుర్తు చేసేలా ఒక చిన్న ప్రయత్నం చేసింది కోల్ కతాకు చెందిన బెహాలా బారిషా కమిటీ.. 

ప్రతిష్టాత్మకం దుర్గా పూజా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని వలస కార్మికురాలిగా రూపొందించింది. ఓ మహిళ వలస కార్మికురాలు తన పిల్లలను ఎత్తుకుని నిలుచున్నట్లుగా తయారు చేసింది.తల్లి విగ్రహం వెనుక ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయి వందల కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లిన వలస కూలీల కన్నీటి కథను ఈవిధంగా చెప్పడంపై చాలా మంది ప్రశంసిస్తున్నారు.  

Leave a Comment