షాకింగ్ వీడియో.. ఒక్కసారిగా మలుపు తిరిగిన ట్రక్కు..!

పంజాబ్ లోని నవాన్ షహర్ జిల్లాలో జాతీయ రహదారిపై దారుణం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు బలి అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. బహ్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ పాయింట్ – మల్పూర్ రోడ్డులో 18 చక్రాల భారీ ట్రక్ మితిమీరిన వేగంతో వస్తూ.. అకస్మాత్తుగా మలుపు తీసుకుంది. 

దీంతో ఆ ట్రక్కు ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి బోల్తా పడింది. అదే సమయంలో ఆ రహదారిపై రెండు వాహనాలు వస్తున్నాయి. అయితే ఒక కారు కొద్దిలో తప్పించుకుంది. మరో వాహనం ఈ ట్రక్ కింద పడి నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఒక జంట వారి కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే వారిని రక్షించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం బాధాకరం.. ట్రక్ డ్రైవర్ మేజర్ సింగ్ తన ర్యాష్ డ్రైవింగ్ తో ఈ ప్రమాదానికి కారుకుడయ్యాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Leave a Comment