DRDO అద్భుతం.. కేవలం 45 రోజుల్లో 7 అంతస్తుల భవనం..!

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(DRDO) అద్భుతం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం కేవలం 45 రోజుల్లో 7 అంతస్థుల భవనాన్ని నిర్మించి రికార్డు క్రియేట్ చేసింది. కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ బిల్డింగ్ ని నిర్మించింది. ఈ ఏడు అంతస్తుల భవనాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు.

యుద్ధ విమానాల్ని అభివృద్ధి చేసేందుకు ఈ భవనాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వినియోగించనుంది. భారత వైమానిక దళం 5వ తరం విమానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వైమానిక దళం శక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు మధ్యమస్థాయి, సుదూరం వరకూ ప్రయాణించగలిగే యుద్ధ విమానాలను అభివృద్ధి చేసేందుకు ఏఎమ్సీఏ ప్రణాళిక చేపట్టింది. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.

ఇక ఈ 7 అంతస్తుల భవనాన్ని సంప్రదాయ, ప్రీ-ఇంజనీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడి హైబ్రిడ్ టెక్నాలజీతో కేవలం 45 రోజుల్లో పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును నవంబర్ 22, 2021న శంకుస్థాపన చేయగా.. ఫిబ్రవరి 1న పనులు ప్రారంభించింది. బెంగళూరు DRDO శాస్త్రవేత్తలు ఈ బిల్డింగ్ ని రికార్డు సమయంలో పూర్తి చేశారు. 

Leave a Comment