పంది గుండెను 25 ఏళ్ల క్రితమే.. అమర్చిన మన దేశ డాక్టర్..!

ఇటీవల అమెరికా వైద్యులు వైద్య శాస్త్రంలో సంచలనం సృష్టించారు. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు. గుండె పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ వ్యక్తికి పంది గుండెను ట్రాన్స్ ప్లాంట్ చేశారు. మేరీల్యాండ్ కి చెందిన డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో రాబోయే రోజుల్లో అవయవదానాల కొరతను అధిగమించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. 

ఇలా జరగడం ప్రపంచంలోనే తొలిసారి అని అమెరికా వైద్యులు అంటున్నారు. కానీ 25 ఏళ్ల క్రితమే మన దేశానికి చెందిన ఓ డాక్టర్ ఈ ఆపరేషన్ చేశాడు. 32 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చాడు. అస్సాంలోని సోనాపూర్ కి చెందిన ధనిరామ్ బారువా అనే వైద్యుడు ఈ ఆపరేషన్ చేశాడు. అయితే ధనిరామ్ సర్జరీ సమయంలో కొన్ని తప్పులు చేయడంతో ఆ సక్సెస్ కాలేదు. పైగా ఇలా చేసినందుకు జైలు శిక్షను ఎదుర్కొన్నాడు. అది సక్సెస్ అయి ఉంటే ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన వైద్యుడిగా నిలిచేవాడు.. 

ధనిరామ్ బారువా 1980వ దశకంలో ప్రపంచంలోనే గొప్ప గుండె వైద్య నిపుణుల్లో ఒకరిగా పేరుపొందారు. 1997 జనవరిలో హాంగ్ కాంగ్ కి చెందిన జోనాథన్ హోకీ షింగ్ అనే హార్ట్ సర్జన్ తో కలిసి ఓ ప్రయోగం చేశారు. గుండెకు రంద్రం పడిన ఓ 32 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ చేసి పంది గుండెను అమర్చారు. అయితే వారం రోజుల తర్వాత పలురకాల ఇన్ఫెక్షన్ల కారణంగా ఆ పేషెంట్ చేనిపోయాడు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. 

ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ కి ఆయన ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. తన పరిశోధనల వివరాలను ఉన్నతస్థాయి సమీక్షలకు పంపకుండా నేరుగా పంది గుండెను అమర్చారు. దీంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. 40 రోజులపాటు జైల్లో గడపాల్సి వచ్చింది. 25 ఏళ్ల తర్వాత అత్యాధునికి టెక్నాలజీతో అమెరికా వైద్యులు పంది గుండెను మనిషికి అమర్చి చరిత్ర సృష్టించారు. ధనిరామ్ అప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి.. సమీక్షలకు పంపి సర్జరీ చేసి ఉంటే ఆ గుర్తింపు 25 ఏళ్ల క్రితమే మన దేశానికి చెందిన వైద్యుడికి వచ్చేది.. 

Leave a Comment