జీవితంలో ఎవరినీ నమ్మొద్దు.. బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటారు. ప్రతిరోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, తప్పుడు పోస్టులు పెట్టినా వెంటనే కౌంటర్ వేస్తుంటారు. అలాంటి బండ్ల గణేష్ తాజాగా వదిలిన ఓ ఆడియో సంచలనంగా మారింది. 

జీవితంలో ఎవర్నీ నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఓ ఆడియో ఫైల్ ని బండ్ల గణేష్ షేర్ చేశారు. ‘జీవితంలో ఎవరినీ నమ్మొద్దు. మనల్ని మనం నమ్ముకుందాం.. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్ముకుందాం. మన తల్లిదండ్రులను, మనల్ని నమ్మి వచ్చిన భార్యను, మన పిల్లల్ని ప్రేమిద్దాం.. వాళ్లకు మంచి భవిష్యత్తునిద్దాం.. మనల్ని కన్న తల్లిదండ్రులకు మంచి జీవితానిద్దాం..ఎందుకంటే మన మీద వాళ్లు కోటి ఆశలతో ఉన్నారు. మన పిల్లలకు మంచి దారి చూపిద్దాం.. కొందరి మోజులో పడి మన వాళ్లకు అన్యాయం చేయొద్దు’ అంటూ బండ్ల గణేష్ తెలిపారు. 

ఈ ట్వీట్ క్షనాల్లో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ టాపిక్ తీస్తూ.. బాగానే చెప్పారు బండ్లన్నా.. మరీ మీ పీకే సంగతేంటీ? అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నట్టుండి నువ్వు ఇలాంటి సందేశాలు ఎందుకిస్తున్నావ్? జీవితంలో ఎదురుదెబ్బ తగిలిందా? అని కామెంట్లు చేస్తున్నారు.   

 

 

 

Leave a Comment