కెరీర్ లో తొందరపాటు నిర్ణయాలు వద్దు..!

ప్రతి ఒక్కరికి ఓ జీవిత లక్ష్యం ఉంటుంది.. ఏదో ఒకటి సాధించాలని అనుకుంటూ ఉంటారు..ఇతరుల మీద ఆధారపడకుండా తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలని, తమ సొంత ప్రణాళికలతో జీవన విధానన్ని కొనసాగించాలని కోరుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను నిర్వహించుకుని ఓ మంచి కెరీర్ ని నిర్మించుకోవడానికి జీవితంలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడుతారు. దాని కోసం ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు..

ఇక మరి కొంత మంది మాత్రం దొరకిన అవకాశంతోనే సర్దుకుపోతారు. కెరీర్ గురించి ఆలోచించకుండా సామాన్య జీవితాన్ని గడుపుతారు.. మరికొంత మందికి అయితే కెరీర్ ను ఎలా మలుచుకోవాలో అర్థం కాక తికమకపడుతుంటారు. అటు ఇటు నిర్ణయాలు తీసుకుంటూ సతమతమవుతుంటారు.. ఏ సమయంలో ఎటువంటి స్టెప్ వేయాలి? ఎటువంటి ప్రణాళికలు మన జీవితానికి తోడ్పడుతాయి? అన్న విషయాల గురించి సరైన అవగాహన ఉండదు.. దీంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు..

మీ గురించి మీకే తెలుసు:

మీరు జీవితంలో ఎదగాలనుకుంటే ఇతరులు చెప్పిన విధంగా నడుచుకోకుండా మీకు మీరుగానే ఉండాలి. మీరు నిర్దేశించుకున్న బాటలోనే ముందుకు నడవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మీ గురించి మీకంటే బాగా ఇంకెవ్వరికీ తెలీదు..మీ ఇష్టాలు, కోరికలకు అనుగుణంగా కార్యాచరణకు, కరీర్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీరు కోరుకున్న జీవితాన్ని, కెరీర్ ను మలుచుకోగలుగుతారు.

మానవుల కోరికలు అనంతం.. వాటిని తీర్చుకోవడానికి మొత్తం జీవితాంతం సరిపోదు కాదుకదా.. ఆలోచించడానికే సమయం సరిపోతుంది. అయితే అందులో కొన్ని ప్రత్యేకమైన కోరికలు కూడా ఉంటాయి. అటువంటి వాటికే ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మీకు ఏం చేస్తే నచ్చతుందో.. ఎలాంటి ఉద్యోగం చేస్తే మీరు సంతోషంగా ఉంటారో.. ఏ పని అయితేే ఎక్కవ శ్రమ అనిపించదో.. ముందుగా అటువంటి విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి..

ఓ పట్టిక రాసుకోండి:

మీకు ఏది నచ్చిందో మీరు తెలుసుకోకపోతే.. ముందుగా మీకు ఎక్కువగా నచ్చే విషయాల గురించి ఒక పట్టికను రాసిపెట్టుకోండి.. వాటి గురించే నిత్యం ఆలోచించడం మొదలుపెట్టండి.. అందులో మరీ ముఖ్యమైనవి ఏదో ఏకాగ్రతతో గమనించండి.. అప్పుడే మీరు మీలో ఉన్న నైపున్యత, సామర్థ్యతను తెలుసుకోగలరు. దాని ద్వారా మీకు నచ్చే ఉద్యోగం గానీ, పనిగానీ, భవిష్యత్ ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం గానీ జరుగుతుంది..

ఇలాంటి వాటి గురించే ఎక్కువసేపు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా.. దొరికిన ఉద్యోగాల్లో చేరిపోవాలి. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ అభిరుచులు, కోరికలను బేరీజు వేసుకుంటూ.. మీ నైపుణ్యాలను మరింత పదును చేసుకోవచ్చు. పని ఎంత కష్టం అయినప్పటికీ దానిని అధికమిస్తూ భవిష్యత్ కార్యాచరణలను ఏర్పాటు చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయానుకూలంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ.. కెరీర్ ను నచ్చిన విధంగా మలుచుకోవాలి… 

Leave a Comment