టాబ్లెట్స్ స్టిప్ కాదు.. ఇది పెళ్లి కార్డు.. వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక..!

ప్రతి ఒక్కరూ తమ వివాహం చిరస్మరణీయంగా, అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు! అందుకే పెళ్లి సందర్భంగా చాలా మంది ప్రత్యేకమైన ఫీట్లు కూడా చేస్తుంటారు. వధువు ఎక్కడికి బుల్లెట్‌తో ప్రవేశించడం, వరుడు హెలికాప్టర్ లేదా బుల్‌డోజర్‌ లో చేరుకోవడం చేస్తుంటారు. ఇక వారి పెళ్లి కార్డులు ఎంతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.

 తాజాగా ఓ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి, మొదట దాన్ని చూస్తే అది ‘పెళ్లి కార్డు’ అని అనిపించదు, ఏదో టాబ్లెట్ స్ట్రిప్ అనుకుంటారు. అయితే దానిపై రాసి ఉన్న సమాచారం చదివితేనే అర్థమవుతుంది, పెళ్లికి ఆహ్వానించారని.. ఈ కార్డును ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. ‘ఇది అద్భుతమైనది. టాబ్లెట్స్ స్టిప్ అని పొరబడకండి. ఇది వివాహ ఆహ్వాన పత్రిక’.. ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఈ వివాహ కార్డు తమిళనాడులోని తిరువణ్ణామలై నివాసితులైన ఎళిలరసన్, వసంతకుమారి వివాహానికి సంబంధించినది. ఎగిలరసన్ ఎం.ఫార్మా చేసి, స్థానిక కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, వసంతకుమారి కూడా ఎంఎస్సీ చేసి నర్సింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డ్రగ్ స్ట్రిప్ లాగా, ఈ కార్డులో స్నేహితులు మరియు బంధువులందరూ ఈ పెళ్లిని మిస్ చేసుకోవద్దని ‘హెచ్చరిక’ కూడా ఉంది. అంతే కాకుండా పెళ్లి వేదిక, టైమింగ్, రిసెప్షన్ తేదీ, డీజే తదితర సమాచారాన్ని కూడా దానిపై ముద్రించారు.

Leave a Comment