కుక్కలకు ఘనంగా పెళ్లి చేసి.. విందు ఏర్పాటు చేశారు.. వైరల్ వీడియో..!

కుక్కలను చాలా మంది ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. అవి మరణిస్తే వాటికి మనుషులకు చేసినట్లే అంత్యక్రియలు, సంతాదినాలు చేసే వారున్నారు. కానీ వీరు మాత్రం కుక్కలకు పెళ్లి చేశారు. బహుశా కుక్కలకు పెళ్లి చేయడం ఇదే తొలిసారి కావచ్చు. కేరళలోని త్రిసూర్ లోని పున్నయార్కుళంలో సోమవారం ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

కేరళలోని పున్నయురుక్కుళంకు షెల్లీకి ఆకాష్, అర్జున్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. మూడేళ్ల క్రితం వీరు ఓ పప్పీని పెంచుకోవాలనుకున్నారు. అలా వారింట్లోకి యాసిడ్ వచ్చి చేరింది. బీగల్ జాతికి చెందిన యాసిడ్ వారి కుటుంబంలో భాగమైపోయింది. ఇక యాసిడ్ కు ఓ వయస్సు వచ్చాక తోడు కోసం వెతుక్కుంది. దీంతో ఆ డాగీకి పెళ్లి చేయాలని భావించారు. మంచి ఆడ శునకం దాదాపు ఏడాది పాటు వెతికారు.

సరిగ్గా మూడు నెలల కిందట యాసిడ్ కు తగిన జోడి జాన్వీ దొరికింది. జాన్వీ పెంచుకుంటున్న కుటుంబాన్ని సంప్రదించి పెళ్లికి ఒప్పించారు. పెళ్లికి సరైన ముహూర్తం కోసం ఎదరుచూశారు. మలయాళ మాసం ‘కన్నీ’ రాగానే వీరి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ‘కున్నతుర్మానా’ రిసార్టులో పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గాచేశారు. పెళ్లి కోసం జాన్వీ సంప్రదాయ డిజైనర్ స్కర్ట్ ధరించి ముస్తాబైంది. కేరళ స్టయిల్ కసవు షర్ట్ లో యాసిడ్ మెరిశాడు. కరోనా జాగ్రత్తలో ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక కోడలిని సంప్రదాయబద్ధంగా తమ ఇంటికే తీసుకెళ్లింది షెల్లీ కుటుంబం. వధూవరుల కుటుంబాలతో పాటు అతిథులను కూడా పెళ్లికి ఆహ్వానించారు. విందులో ప్రత్యేకంగా చికెన్ బిర్యానీ వడ్డించారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో ట్రెండింగ్ గా మారింది.    

 

  

Leave a Comment