వినాయక గుడి బయట భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తున్న కుక్క..వీడియో వైరల్..!

నాగ దేవత కొలిచే పాముకు పూజ చేయడం చూశాం.. ఏనుగు నుంచి ఆశీర్వాదం తీసుకోవడం చూశాం..కానీ గుడి ముందు కుక్క ఆశీర్వాదం ఇవ్వడం, చెయి ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో స్వామి దర్శనం తర్వాత బయటకు వచ్చే దారిలో ఓ అరుగుపై సింహం స్టయిల్ లో కూర్చుంటున్న కుక్క భక్తులు దగ్గరికి రాగానే వారికి ఆశీర్వాదం ఇవ్వడం విశేషం..

కుక్క ముందు తల వంచితే తన కాలితో ఆశీర్వాదం ఇస్తుంది. అదే చేయి చాపితే మన చేయిలో కాలు పెడుతుంది. కొన్ని రోజులు ఆ కుక్క అక్కడే కూర్చుంటుందని, భక్తులకు ఆశీర్వాదం ఇస్తుందని సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు నెటిజన్లు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 

Leave a Comment