క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌ను గుర్తించేందుకు ‘చాట్ బాత్’ ..

 భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న సంద‌ర్భంగా భార‌త ప్ర‌భుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేప‌థ్యంలో బెంగ‌ళూరుకు చెందిన హెల్త్‌టెక్ స్టార్ట‌ప్ డాక్ఆన్‌లైన్ స‌ర్వీసును ప్ర‌జ‌లు క‌రోనా వ్యాధి ల‌క్ష‌ణాల‌ను తెలుసుకొనేందుకు ప్రారంభించింది. కోవిడ్ 19 రిస్క్ ఎక్కువుగా ఉందా లేదా మ‌ధ్య‌స్తంగా ఉందా అని తెలుసుకోవ‌డానికి ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతోంది. ఈ ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగేంత వ‌ర‌కు ప్ర‌జ‌ల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ఉచితంగా వైద్యుల స‌ల‌హాల‌ను అందించేందుకు డాక్ ఆన్‌లైన్ నిర్ణ‌యించింది. ఒక‌సారి త‌మ యొక్క కోవిడ్ 19 రిస్క్ తెలుసుకున్న త‌రువాత ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే ఉండి వీడియో కాల్ ద్వారా త‌మ ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకోవచ్చు.

డాక్ ఆన్‌లైన్ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌రియు సీఈవో మార్క‌స్ మోడింగ్ మాట్లాడుతూ క‌రోనా అనుమానితులు ఎవ‌రైనా మా ఆటోమేటెడ్ చాట్ బాట్‌ను ఉప‌యోగించి త‌మ ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకోవ‌చ్చ‌న్నారు. ఈ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నార‌ని తెలిపారు. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వారి ఇళ్ల వ‌ద్ద‌నే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదురించి ప్ర‌భుత్వానికి సంఘీభావం తెలియ‌జేయ‌డానికి మేము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు.

       డాక్ ఆన్‌లైన్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా వినియోగదారులు  www.doconline.com కు వెళ్లొచ్చు లేదా 8822126126 నెంబ‌ర్‌కు ఫోన్ చేసి ఉచిత స‌ల‌హాలు పొంద‌వ‌చ్చన్నారు. ద‌య‌చేసి కూపన్ కోడ్ COVID19 ను ఉప‌యోగించండి. సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటార‌ని పేర్కొన్నారు.

 

Leave a Comment