ఆస్ట్రేలియా ఆటగాళ్లు బూట్లలో బీర్ ఎందుకు తాగారో తెలుసా?

టీ20 వరల్డ్ కప్ టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచిన విషయం తెలిసిందే.. న్యూజిల్యాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో టైటిల్ ఎగురేసుకుపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్స్ సంబరాల్లో మునిగితేలారు.. సంబరాల్లో భాగంగా తమ బూట్లను విడిచి వాటిలో బీర్ పోసుకోని తాగారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన ఈ చేష్టలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అసలు బూట్లలో బీర్ పోసుకోని ఎందుకు తాగారు ? అంటూ అందరు ఆశ్చర్యపోతున్నారు.. 

బూట్లలో బీరు పోసుకోని తాగడం అనేది ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారం.. ఆ పాత ఆచారాన్నే ఇప్పుడు వారు పరిచయం చేశారు. ఈ పద్ధతిని ‘షూయి’ అని పిలుస్తారు.. 18వ శతాబ్దంలో జర్మనీలో ఈ ఆచారం మొదలైంది. ఏదైన అదృష్టం కలిసి వచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్షగా, లేదా సంబరాలకు చిహ్నంగా దీనిని భావించేవారు. ఈ ఆచారం ఆస్ట్రేలియాలోబ బాగా పాపులర్ అయింది. ఇటీవల ఆస్ట్రేలియా రైడర్ జాక్ మిల్లర్, ఫార్ములా వన్ డ్రైవర్ డేనియల్ రెకిర్డోలు షూలో బీర్ పోసుకోని తాగారు..

ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం అదే ఆచారాన్ని ఫాలో అయ్యారు. వారి షూలో బీర్ పోసుకోని తాగారు.. అయితే ఇ ఆరోగ్యానికి మంచిదేనా? అంటే కాదనే అంటున్నారు వైద్య నిపుణులు.. దీనిలో స్టాఫలోకాకస్ అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉంటాయని గుర్తించారు. ఇది కడుపులోకి వెళ్తే సెప్టిసిమియా, నిమోనియా, వాంతులు, ఆహారం విషపూరితం కావడం వంటి ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆచరయోగ్యమైనది కాదని వైద్యలు సూచిస్తున్నారు.   

 

Leave a Comment