డెంగ్యూ దోమ ఎలా ఉంటుందో తెలుసా?.. అది ఏ టైమ్ లో కుడుతుందంటే..!

ప్రస్తుత సీజన్ జ్వరాల సీజన్.. అందులో చాలా మంది డెంగ్యూ జ్వరాల బారీన పడుతున్నారు. ఈ జ్వరం చాలా ప్రమాదకరం.. ఎందుకంటే.. ఈ జ్వరం శరీరంలోని తెల్ల రక్తకణాలను పూర్తిగా తగ్గించేస్తుంది. తెల్ల రక్తకణాలు తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం.. ఈ జ్వరం నుంచి తప్పించుకోవాలంటే దాని గురించి అవగాహన ఉండాలి. 

అసలు ఈ డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది? దేని వల్ల వస్తుంది? అనే దానిపై అవగాహన ఉండాలి. డెంగ్యూ జ్వరం దోమల వల్ల వస్తుంది. ఈడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల డెంగ్యూ జ్వరం వ్యాప్తి చెందుతుంది. అంత భయంకరమైన ఈ దోమ ఎలా ఉంటుంది? ఏ సమయంలో ఇది కుడుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఏ సమయంలో కుడుతాయి?

ఈ డెంగ్యూ వ్యాప్తికి ఈడిస్ ఈజిప్టి అనే దోమ కారణం. దీనిని ఎల్లో ఫీవర్ మస్కిటో అనే పేరుతోనూ పిలుస్తారు. ఈ డెంగీ దోమలు ప్రధానంగా ఉదయం 7 నుంచి 9 గంటల సయమం వరకు, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో కుట్టే దోమలపై జాగ్రత్తగా ఉండాలి.

ఎక్కడ కుడతాయి?

ఈ దోమలు చీలమండలు, మోచేతుల దగ్గర ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఇది కూడా గమనించాలి. అవసరమైతే, ఆ భాగాల్లో మీరు దోమల వికర్షక క్రీమ్ ఉపయోగించవచ్చు. దాంతో సమస్య తగ్గుతుంది.

ఎక్కడ పెరుగుతాయి?

నీరు నిల్వ ఉన్న చోట, తడి ప్రదేశాలలో డెంగ్యూ దోమలు గుడ్లను పొదుగుతాయి. అవి 3 సంవత్సరాల వరకు జీవించగలవు. కాబట్టి మూలల్లో తడిగా లేకుండా చూసుకోవాలి.

ఎలా గుర్తించాలి?

ఈ దోమలను గుర్తించడానికి సులభమైన మార్గం వాటి నలుపు రంగు. అలాగే కాళ్ళపై తెల్లటి మచ్చలు ఉంటాయి. ఈడిస్ ఈజిప్టిని గుర్తించడానికి ఇవి ప్రధాన మార్గాలు. 

Leave a Comment