రవితేజ తీసుకున్న మొదటి రెమ్మూనరేషన్ ఎంతో తెలుసా?

మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ చిత్రం ఘన విజయం సాధించింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతీహసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించారు. క్రాక్ సినిమా విజయం సాధించిన సందర్భంగా రవితేజ ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. 

ఈ సందర్భంగా ఆయన తన కేరీర్ స్టార్టింగ్ లో జరిగిన విషయాలను పంచుకున్నారు. తాను తీసుకున్న ఫస్ట్ రెమ్మూనరేషన్ గురించి మాట్లాడుతూ..‘నిన్నే పెళ్లడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు నా తొలి చెక్కును అందుకున్నాను. అప్పుడు రూ.3500 చెక్కును హీరో నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నాను’ అని రవితేల అన్నారు. 

అదే తన మొదటి రెమ్మూనరేషన్ కావడంతో ఆ చెక్కును చాలా కాలం భద్రంగా దాచుకున్నాని తెలిపారు. అయితే ఓ సారి డబ్బులు అసరం పడటంతో ఆ చెక్ ను బ్యాంక్ కు వెళ్లి మార్చేశానని చెప్పారు. కాగా రావితేజ తన కేరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సహాయనటుడుగా పలు సినిమాల్లో కనిపించన సంగతి తెలిసిందే.. 

Leave a Comment