వేడినీరు తాగడం వల్ల కలిగే నష్టాలు ఎంటో తెలుసా? 

వేడినీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు.. ఇది మితంగా తీసుకుంటే పర్వాలేదు.. కానీ అతిగా తీసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. చాలా మంది గ్లాసు వేడి నీటితో తమ రోజును ప్రారంభిస్తారు. అయితే కొంత మంది రోజంతా వేడి నీరు తాగుతుంటారు.. అయితే వేడి నీటిని అతిగా తీసుకోవడం వల్ల కొన్ని హానికరమైన ప్రభావాలు ఉన్నట్లు చెబుతున్నారు..ఇప్పుడు వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.. 

వేడి నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు:

  • వేడి నీళ్లు పేగు కదలికలను క్రమబద్ధీకరించడంలో ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థను సున్నతంగా చేస్తుంది.. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.. 
  • వేడి నీళ్లు శరీరంలో టాక్సిన్స్ ని తొలగిస్తాయి. వేడి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట పట్టేలా చేస్తుంది. 
  • చర్మ కణాలను రిపేర్ చేయడంలో ఉపయోగపడుతుంది. చర్మం ప్రమాదకరమైన ప్రీ రాడికల్స్ ని అభివృద్ధి చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. చర్మం మృదువుగా మారడంలో తోడ్పడుతుంది. 
  • ఉదయం పూట వేడి నీరు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.
  • జలుబు, నాసికా అలెర్జీల వల్ల కలిగే సైనస్ లపై ఒత్తిడిని వేడి నీరు తగ్గించగలదు..ఇది సైనస్‌లను అన్‌లాగ్ చేస్తుంది. ఇది శ్లేష్మాన్ని త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది.
  • గోరువెచ్చని నీరు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు కూడా ప్రసిద్ధి చెందింది.
  • ఋతు చక్రం సమయంలో.. గోరువెచ్చని నీరు తాగితే కడుపు నొప్పి, తిమ్మిరిని అధిగమించడానికి సహాయం చేస్తుంది.

వేడి నీటిని తాగడం వల్ల నష్టాలు:

అతిగా చేస్తే ఏదైనా హానికరం. వేడినీరు ఎక్కువగా తాగడంలోనూ ఇదే వర్తిస్తుంది. అందుకే దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • నీరు చాలా వేడిగా ఉంటే.. అది మీ నాలుక, రుచి మొగ్గలను కాల్చివేస్తుంది.
  • ఇది అన్నవాహిక, కడుపు వంటి అంతర్గత అవయవాలకు కూడా హాని కలిగించవచ్చు.
  • పడుకునే ముందు వేడి నీటిని తాగడం వలన మీ నిద్ర చక్రం కాస్త గందరగోళానికి గురవుతుంది.

 

 

 

Leave a Comment