బిల్ గేట్స్ వాడే మొబైల్ ఏదో తెలుసా?

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి అందరికీ తెలిసిందే.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆయన ఎప్పుడు వార్తల్లో ఉంటారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో తన వాడే మొబైల్ గురించి చెప్పాడు. అందరూ బిల్ గేట్స్ ఏ యాపిల్ ఫోనో లేదా తన కంపెనీ ప్రత్యేకంగా తీర్చదిద్దిన మొబైల్ వాడుతంటారులే అనుకుంటారు.. కానీ బిల్ గేట్స్ మాత్రం వాడేది శామ్ సంగ్ మొబైల్.. 

అవును ఈ విషయాన్ని బిల్ గేట్స్ రెడిట్ ఆస్క్ మి ఎనిథింగ్ సెషన్ లో వెల్లడించారు. తన వద్ద ‘శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3’ ఉందని చెప్పారు. తన మొబైల్ పేరును తొలిసారిగా బిల్ గేట్స్ ప్రకటించారు. తాను భిన్నంగా ఉన్న వాటిని ప్రయత్నిస్తానని, ఈ స్క్రీన్ తో తాను పోర్టబుల్ పీసీ, మొబైల్ ని పొందగలను తప్ప మరేమీ లేదని బిల్ గేట్స్ వివరించారు. 

ఇక శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 విషయానికి వస్తే.. దీని ధర రూ.1,49,999గా ఉంది. ఇక ఈ ఫోన్ లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ఉంటుంది. ఈ ఫోన్ ఓపెన్ చేస్తే 120Hz రిఫ్రెష్ రేట్ తో 7.6 అంగుళాల డిస్ ప్లే, ఫోన్ మూసినప్పుడు 6.2 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఈ ఫోన్ ని ఫోల్డ్ చేయవచ్చు.  

 

Leave a Comment