ఆ చైనీస్ యాప్స్ వాడొద్దు : ఇంటెలిజెన్స్ సిఫార్సు

చైనాకు సంబంధించిన 52 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేయాలని భారత ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. వాటిని బ్లాక్ అయినా చేయాలని, లేదా వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపునివ్వాలని సూచించారు. ఈ జాబితాలో టిక్ టాక్, జూమ్ యాప్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్ ఇట్ మరియు క్లీన్ మాస్టర్ తో పాటు మరో 52 యాపులు ఉన్నాయి. 

ఈ యాప్ లు దేశ భద్రతకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు సూచించిన దానికి జాతీయ భద్రతా కౌన్సిల్ కూడా మద్దతు పలికింది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సిఫార్సులపై కేంద్రం చాలా లోతుగా చర్చలు జరుపుతోందని, ప్రతి మొబైల్ యాప్ తో వచ్చే ప్రమాదాన్ని ఒక్కొక్కటిగా అధికారులు పరిశీలిస్తున్నారని అధికారులు చెప్పారు. 

చైనీస్ డెవలపర్లు అభివృద్ధి చేసిస లేదా చైనీస్ లింక్ లతో ఉన్న కంపెనీలతో ప్రారంభించిచిన అనేక ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్ లు స్పైవేర్ లేదా మాలికులర్ వేర్ గా ఉపయోగించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డేటా భద్రతపై ఇవి హానికరమని, వీటిని ఉపయోగించవద్దని భద్రతా సంస్థలు సూచించాయి. 

Leave a Comment