నా పేరు ముందు అవి వాడొద్దు : లేఖలో ఎస్పీ బాలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనకు ఇక లేరు…ఇక నుంచి మనం ఆయన పాటలను వినలేం.. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆయన అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మరణించిన విషయం తెలిసిందే.. శనివారం ఎస్పీ బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

కాగా ఆయన స్వహస్తాలతో రాసిన ఒక లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఇందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ కొన్ని చిన్నచిన్న అభ్యర్థనలను మన్నించాలని కోరారు. ‘దయచేసి నా పేరుముందు ‘డాక్టర్’, ‘పద్మభూషణ్’, ‘గాన గంధర్వ’ లాంటి విశేషణలు వేయకండి’ అని ఆ లేఖలో కోరారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment