‘ఆర్ఆర్ఆర్’ నుంచి దీపావళి సర్ ప్రైజ్ గిఫ్ట్..ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫోటోలు..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా, ఆలియాభట్, ఓలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కాగా దీపావళి సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. 

ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి పలు ఫొటోలను పోస్ట్ చేసింది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి ముగ్గురు కలిసి ముచ్చటిస్తున్న ఫొటోలను షేర్ చేసింది. మరో ఫొటోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ చిరునవ్వులు చిందిస్తూ సంభాషిస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు ఆర్ఆర్ఆర్ టీమ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. 

 

Leave a Comment