మగాళ్లలో ఫస్ట్ అదే చూస్తా : బిగ్ బాస్ బ్యూటీ దివి వద్యా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో అందరినీ ఆకట్టుకుంది అందాల తార దివి వద్యా..తన అందం అభినయంతో చాలా మంది యువకులకు కలల రాణిగా మారిపోయింది. తాజాగా 2020 సంవత్సరంలో టెలివిజన్ రంగంలో అత్యంత ప్రతిభను కనబర్చిన సెలబ్రిటీలను హైదరాబాద్ టైమ్స్ ఎంపిక చేసే జాబితాలో దివి వద్యాకు చోటు దక్కింది. ఈ సందర్భంగా దివి మీడియాతో మాట్లాడింది. 

అది గొప్ప అనుభవం:

టీవీ రంగంలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎంపికయ్యావంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి కాల్ రావడం గొప్ప అనుభవమని దివి తెలిపింది. అలాంటి కాల్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పింది. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అనే అవార్డు తనకు కొత్త అవకాశఆలు రప్పించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది.

ముందు చూసేది అదే: 

తనకు పొడుగ్గా ఉండే యువకులంటే చాలా ఇష్టమని దివి తన మనసులో మాటను చెప్పింది. తన ఎత్తు 5.8 అని తనకు కాబోయే వాడు 6.2 లేదా 6.3 ఉండాలని తెలిపింది. తాను ఎవరినైనా చూడగానే ముందు వారిలో చూసేది హైట్ అని, రెండోది ఇంటెలిజెన్స్ అని చెప్పింది. తాను ఇంకా ఎవరి ప్రేమలోనూ పడలేదని, ఇంకా సింగిల్ గానే ఉన్నానని స్పష్టం చేసింది.   

చిరంజీవితో కలిసి నటించా:

సినీ పరిశ్రమలో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని దివి వద్యా తెలిపారు. ఇటీవల స్పార్క్ ఓటీటీలో విడుదలైన క్యాబ్ స్టోరీస్ కు మంచి ప్రశంసలు వస్తున్నాయని, తన నటనకు, గ్లామర్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని పేర్కొంది. చిరంజీవితో కలిసి ఓ చిత్రంలో నటించానని, అలాగే కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తున్నానని దివి వెల్లడించారు. 

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)

Leave a Comment