ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ..

ఏపీ ప్రభుత్వం పేదలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 25న ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 

డిసెంబర్ 25న అర్హులకు డి-ఫామ్ పట్టా ఇచ్చి స్థలం కేటాయించనున్నారు. అదే రోజు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో జూలై 8నే ప్రారంభం కావాల్సిందే. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈక్రమంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడకూదని భావిస్తున్న ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.  

Leave a Comment