క్రికెటర్ తో దర్శకుడు శంకర్ కూతురి పెళ్లి..!

15
Shankar Daughter Marriage2

ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో మధురై పాంథర్ జట్టుకు కెప్టెన్. ఆయన తండ్రి దామోదర్ చెన్నైలో బడా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. మధురై పాంథర్స్ జట్టుకు యజమానిగానూ వ్యవహరిస్తున్నారు. శంకర్ కూతురు ఐశ్వర్య వైద్యురాలు. 

మహాబలిపురంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని వెల్ కమ్ హోటల్ లో జరిగిన ఈ వివాహానికి సెట్ ను అవార్డు గ్రహీత ఆర్ట్ డైరెక్టర్ ముత్తు రాజ్ రూపొందించారు. ఆయన శంకర్ తో కలిసి ఐ, 2.0 సినిమాలకు  పని చేశారు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాకు కూడా పనిచేస్తున్నారు. ఇక దామోదరన్ మరియు పద్మ చాలా దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించారు. గెస్ట్ లిస్ట్ 50 మందికి పరిమితం చేశారు. 

 

Previous articleమాస్క్ పెట్టుకోలేదని బ్యాంక్ కస్టమర్ ని కాల్చిన సెక్యూరిటీ గార్డు..!
Next articleఎడమ కంటి చూపు కోల్పోయిన కత్తి మహేష్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here