ఇది ధోనీ ఫ్యాన్ ఇల్లు.. అభిమానం అంటే ఇలా ఉండాలి..!

ఇక ఐపీఎల్ లో మాత్రం చెన్నై జట్టుకు ఉన్న ఫాలోయింగ్ మరే ఏ ఇతర జట్టుకు లేదు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని ఉండటమే కారణం..అభిమాన క్రికెటర్లపై తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుతూ ఉంటారు. కానీ చెన్నైకి చెందిన ఓ అభిమాని మాత్రం వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు.  తన ఇంటికి ‘ఇది ధోని ఫ్యాన్ ఇల్లు’ అని రాయించుకున్నాడు. 

తమిళనాడులోని కడలూరుకు చెందిన గోపీ కృష్ణన్ చెన్నై సూపర్ కింగ్స్ కు డై హార్డ్ ఫ్యాన్. అందులోనూ ధోని అంటే మహా ఇష్టం.. చెన్నై సూపర్ కింగ్స్ మరియు ధోనిపై ఉన్న అభిమానంతో గోపీ అరంగూర్ లోని తన ఇంటికి పసుపు రంగు పెయింటింగ్ వేయించాడు. గోడలపై ధోనీ బొమ్మలను, చెన్నై సూపర్ కింగ్ లోగోను వేయించాడు. అంతే కాదు తన ఇంటికి ‘హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్’ అని పేరు పెట్టుకున్నాడు. ఈ పెయింటింగ్ వేయించేందుకు 1.5 లక్షల ఖర్చు చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Leave a Comment