ధోని కొత్త ఇన్నింగ్స్.. ‘కడక్ నాథ్’ కోళ్ల వ్యాపారంలోకి ఎంట్రీ..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని వచ్చే ఐపీఎల్ తర్వాత పూర్తిగా క్రికెట్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ తర్వాత అత్యధిక పోషక విలువలు కలిగి, సిరులు కురిపించే కడక్ నాథ్ కోళ్ల పెంపకంపై దృష్టి సారించినట్లు సమాచారం. 

రాంచీలోని ఫాంహౌజ్ లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పే దిశగా ధోని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ధోని టీమ్ 2 వేల కడక్ నాథ్ కోడిపిల్లలను ఆర్డర్ చేసింది. డిసెంబర్ 15న రాంచీకి ఇవి డెలివరీ కానున్నాయి. అంతే కాదు మధ్యప్రదేశ్ గిరిజన రైతు వినోద్ మెండాతో కూడా వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు.

కాగా ఈ కడక్ నాథ్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ల శాతం ఎక్కువగా, ఐరన్ శాతం మామూలు కోళ్ల కంటే 10 శాతం ఎక్కువగా ఉంటుందట. ఈ కోడి మాంసం, చర్మంతో పాటు రక్తం కూడా నల్లగా ఉంటుంది. ఈ జాతి కోడి మాంసం కిలో రూ.700 నుంచి వెయ్యి, గుడ్డు ధర 40 నుంచి 50 రూపాయలు ఉంటుందని సమాచారం.    

Leave a Comment