ఏపీలో తగ్గినపోయిన సంతానోత్పత్తి.. కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ లో సంతానోత్పత్తి తగ్గిపోయింది. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటించేవారి సంఖ్య పెరిగిపోయింది. రాష్ట్రంలో ప్రతి 10 కుటుంబాలకు 17 మంది పిల్లలు మాత్రమే ఉంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఇది వెల్లడైంది. అయితే ఈ సంఖ్య మరీ తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

జాతీయ కుటుంబ సర్వే ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0గా నమోదుకాగా..  ఏపీలో సంతానోత్పత్తి 1.7గా నమోదైంది. 2015-16లో ఇది 2.2గా ఉండేది. 1992-93 లెక్కల ప్రకారం రాష్ట్రంలో సంతానోత్పత్తి 2.59గా ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాలు అమలు చేస్తోంది. సంతానం తగ్గించేందుకు ముందుకొచ్చే వారికి ప్రోత్సహకాలు ప్రకటించింది.

1992 నుంచి 1999 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రచారం వల్ల కుటుంబ నియంత్రణపై ప్రజలలో అవగాహన పెరిగిపోయింది. దీని వల్ల సంతానోత్పత్తి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇక పేద కుటుంబాల్లోనూ పిల్లల పోషణ భారంగా మారింది. ఇది కూడా సంతానోత్పత్తి తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.. 

అయితే సంతానోత్పత్తి తగ్గడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతానోత్పత్తి ఇంతకుమించి తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేకపోతే యువత సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వారు తగ్గుతూ వస్తున్నారు. దీంతో పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది.   

 

 

Leave a Comment