పేదలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్..

పేదల ఇళ్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయం..

పేద ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్తను అందించింది.  గత ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం పేదలకు ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. 

3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించారు. 

మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల నిర్మాణంపై సీఎం సమీక్ష..

వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను అడిగితెలుసుకున్నారు. డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూస్తున్నామని సీఎం తెలిపారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. 

ప్రభుత్వం అంటే నాసిరకం అనే పేరు పోవాలని, ప్రభుత్వం చేస్తే నాణ్యతతో పని చేస్తుందనే పేరు రావాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు జులై 8న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. వారి కేటాయించిన స్థలంవద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలన్న సీఎం

 

Leave a Comment