టీవీ ఆపిందని అత్త చేతివేళ్లు విరిచిన కోడలు..!

ఒకప్పుడు కోడళ్లను అత్తలు హింసించేవారు.. కానీ ట్రెండ్ మారింది.. ఇప్పుడు అత్తలనే కోడళ్లు హింసిస్తున్నారు. ఈ ట్రెండ్ నే ఓ కోడలు ఫాలో అయ్యింది. టీవీ ఆపిందని అత్త చేతివేళ్లను వేరిచింది ఓ కోడలు.. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు వృశాలీ కులకర్ణి(60) అనే మహిళ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంది. ఆ సమయంలో హాలులో ఉన్న కోడలు విజయ్(32) టీవీ చూస్తోంది. సౌండ్ ఎక్కువగా ఉండటంతో పూజకు అంతరాయం కోలుగుతోందని, టీవీ కట్టేయాలని అత్త కేకలు వేసింది. అత్త మాటలను కోడలు పెడచెవిన పెట్టి టీవీ సౌండ్ ఇంకా పెంచింది. కోపంతో అత్త నేరుగా వచ్చి టీవీ ఆపేసింది. దీంతో అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. 

అత్త వేలు చూపించి మాట్లాడడంతో ఆమె చేతి వేళ్లను విరిచేసింది. ఇద్దరికీ సర్ది చెబుదామని ఇంటి లోపలి నుంచి విజయ భర్త సౌరభ్ వచ్చాడు. అయితే భర్త అని చూడకుండా అతనికీ కూడా దెబ్బలు వేసింది విజయ. మూడు వేళ్లు విరిగిపోవడంతో అత్త బుధవారం శివాజీ నగర్ ఠాణాలో కోడలిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

Leave a Comment