బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ.. న్యూజిలాండ్ పోలీసుల దీపావళి వేడుకలు..!

దీపావళి పండుగను భారత దేశంలో ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. కుల, మత భేదాలు లేకుండా దీపావళిని జరుపుకుంటారు. దీపావళి వేడుకలు ప్రజలను ఏకం చేస్తాయని నమ్ముతారు. దీంతో భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ దీపావళిని ఘనంగా జరుపుతారు. అయితే  తాజాగా న్యూజిలాండ్ లో దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. 

దీపావళి పండుగ సందర్భంగా మల్టీ కల్చరర్ కౌన్సిల్ ఆఫ్ వెల్లింగ్టన్ సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా న్యూజిలాండ్ పోలీసులు బాలీవుడ్ పాటలు కర్ గయీ చుల్, కాలా చష్మా పాటలకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను భారత హైకమిషన్ కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.

 ఈ వీడియోలో పోలీసు అధికారల బృందం ఎంతో ఉత్సాహంగా చిరునవ్వులు చిందిస్తూ, ఒకరికొకరు సమన్వయం చేసూకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు.న్యూజిలాండ్ పోలీసులు ఈ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అమేజింగ్ పెర్ఫార్మెన్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment