తెలుగులో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఎవరికంటే..!

Dadasaheb Phalke Awards 2020 :

2019 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. సౌత్ కేటగిరిలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ నిలిచింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి గాను నవీన్ పోలిశెట్టి బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు. ఉత్తమ నటిగా రష్మిక మందనను ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. డియర్ కామ్రేడ్ సినిమాలో నటనకు గాను రష్మిక మందానా ఈ అవార్డు కైవసం చేసుకుంది.  

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’కు దర్శకత్వం వహించిన సుజీత్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది. ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు సంగీతం అందించిన థమన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డును టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జును అందుకున్నాడు. 

Dadasaheb Phalke Awards 2020 Winner List

Leave a Comment