‘టాటా’ పేరుతో మోసం.. క్లిక్ చేస్తే మీ డేటా మాయం..!

ప్రేమికుల రోజులును ఎంపిక చేసుకుని డేటా చోరికి సిద్ధమయ్యారు సైబర్ నేరగాళ్లు.. ఇందుకోసం ప్రముఖ సంస్థ టాటా గ్రూపును ఎంచుకున్నారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మొబైల్ ఫోన్ గెలుచుకోవచ్చంటూ అమాయకులకు గాలం వేస్తున్నారు. సులువైన ప్రశ్నలకు సమాధానాల చెబితే ఎంఐ 11టీ ఫోన్ ను గెలుచుకోవచ్చిన ఉచ్చులోకి దింపుతున్నారు. 

ఏం చేస్తారంటే?

ముందుగా మీ వాట్సాప్ గ్రూప్ తో పాటు మీకు వ్యక్తిగతంగా ఓ మెసేజ్ వస్తుంది. ప్రేమికుల దినోత్సవం రోజు టాటా కంపెనీ మీకు మంచి గిఫ్ట్ ఇస్తోంది అని ఉంటుంది. అందులో సులువైన ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఎంఐ 11టీ ఫోన్ గెలుచుకోవచ్చని ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ గెలుచుకున్నారని మెసేజ్ వస్తుంది. 

ఆ తర్వాత యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. టాటా ప్రమోషన్ ను ఐదు వాట్సాప్ గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు పంపించాలని చెబుతారు. ఈ మెసేజ్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది. వారిలో ఎవరైనా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారంటే అంటే ఫోన్, ల్యాప్ టాప్ లోని డేటా చోరీ అతువుంది. మీ బ్యాంక్ లావాదేవీలన్నీ సైబర్ నేరగాళ్లకు చేరుకుంటాయి. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Leave a Comment