‘మద్యం మత్తులో.. కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ’.. మీరు చూడండి..!

మద్యం తాగి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరం.. తాగి వాహనాలు నడపొద్దని ఎంత చెప్పినా కొందరు వినకుండా వాహనాలు నడుపుతున్నారు. తాగి వాహనం నడపడం వల్ల జరిగే అనర్థాల గురించి సైబరాబాద్ పోలీసులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మందుబాబులు వినడం లేదు..

తాజాగా మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి వీడియోను సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి ఉదయాన్నే మద్యం తాగి, హెల్మెట్ ను అద్దానికి తగిలించి, బైక్ పై రోడ్డు మీదకొచ్చాడు. మద్యం మత్తులో ఊగుతూ.. తూలుతూ రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాలకు అడ్డంగా వస్తున్నాడు. 

రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు డ్రైవింగ్ చేశాడు. ఓ సారి కింద కూడా పడ్డాడు. అదూ రూట్ లో వెళ్తున్న వాహనదారులు ఆ మందుబాబును లేపారు. తిరిగి మళ్లీ డ్రైవ్ చేస్తూ రోడ్డు మధ్యలోకి వెళ్లి అడ్డదిడ్డంగా డ్రైవ్ చేశాడు. చివరికి వెళ్లి ఓ కారును గుద్దేశాడు. ఇబ్రహీంపల్లి గేట్ వద్ద ఈనెల 4న జరిగిని ఈ ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘ కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’ అంటూ టైటిల్ పెట్టి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోజిలను జోడించారు..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment