క్యూట్ వీడియో: అలిగిన టీచర్.. ముద్దు పెట్టి బుజ్జగించిన బుడ్డోడు..!

పాఠశాల రోజులు గుర్తున్నాయా? తప్పు చేస్తే టీచర్ బెత్తంతో కొట్టడం.. గోడ కుర్చీ వేయించడం చేసేవారు. ఇవన్నీ 90ల కాలం నాటి విద్యార్థులు అనుభవించిన శిక్షలు..ప్రస్తుతం కాలం మారింది.. దీంతో పాటు విద్యార్థులకు శిక్షలు కూడా మారాయి.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ బుడ్డోడు తన క్లాస్ టీచర్ కి ముద్దులు పెట్టి క్షమాపణలు చెబుతున్నాడు. 

క్లాస్ రూమ్ లో అల్లరి చేసినందుకు ఆ బుడ్డోడిపై టీచర్ కు కోపం వచ్చింది. ఇకపై అతనితో మాట్లాడనని చెప్పింది. దీంతో ఆ పసివాడు టీచర్ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. టీచర్ మాత్రం ఒప్పుకోలేదు. నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు. తప్పు చేయనని చెప్పి మళ్లీ మళ్లీ చేస్తుంటావ్. నీతో ఇక మాట్లాడనని అలిగింది.

దీంతో ఆ బుడ్డోడు మళ్లీ సారీ చెప్పాడు. మళ్లీ క్లాస్ లో అల్లరి చేయను అని చెప్పాడు. ఇదే చివరిసారని అన్నాడు. అంతేకాదు టీచర్ కు రెండు ముద్దులు కూడా పెట్టాడు. దీంతో ఆ టీచర్ అలక వీడింది. బుడ్డోడికి తిరిగి ముద్దు ఇచ్చింది. ఈ అందమైన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.. నా చిన్నతనంలో అలాంటి స్కూల్ ఎందుకు లేదు అంటే కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment