Flipkart: రూ.51 వేల విలువైన ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. రెండు సబ్బులు వచ్చాయి.. వీడియో వైరల్..!

ఈ పండగ సీజన్ లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. తక్కువ ధరకు లభిస్తాయి కదా అని చాలా మంది ఇలాంటి ఆఫర్ల కోసమే ఎదురుచూస్తుంటారు. ఈ కామర్స్ సంస్థలన్నీ కూడా యూజర్లను ఆకట్టుకోవడానికి అనేక రకాల క్యాస్ బ్యాక్ ఆఫర్లను, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ అయితే ‘బిగ్ బిలియన్ డేస్’ అంటూ భారీ ఆఫర్లను ప్రకటించింది. కానీ ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితమై ఆర్డర్ చేసిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది..

ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో సిమ్రాన్ పాల్ సింగ్ అనే వ్యక్తి రూ.51 వేల విలువైన ఐఫోన్ – 12 ఆర్డర్ చేశాడు. కొత్త ఐఫోన్ కోసం ఎదురుచూశాడు. పార్శిల్ వచ్చాక కొత్త ఐఫోన్ చూద్దామని పార్శిల్ ఓపెన్ చేసి షాక్ అయ్యాడు. ఆ పార్శిల్ లో ఐఫోన్-12 లేదు.. రెండు సబ్బులు కనిపించాయి. దీంతో సిమ్రాన్ పాల్ సింగ్ ఫిప్ కార్ట్ కస్టమర్ కేర్ కు కాల్ చేశాడు. అయితే తాను డెలివరీ పార్ట్ నర్ కు ఓటీపీ షేర్ చేయలేదు. దీతో అతనికి పార్శిల్ డెలివరీ అయినట్టు కాదు. ఇదే విషయాన్ని కస్టమర్ కేర్ కు వివరించాడు. దీనిపై ఫ్లిప్ కార్ట్ విచారణ చేపట్టింది. చివరికి తప్పు తమ వైపే ఉందని తెలుసుకుంది. ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసి కస్టమర్ కు బడ్బులను రీఫండ్ చేసింది. కాగా సిమ్రాన్ పాల్ సింగ్ పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేసి దానిని ఓ యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

 

Leave a Comment