రైతుల ఖాతాల్లో పంటల బీమా డబ్బు జమా..!

ఏపీ రైతులకు సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వాతావరణ పరిస్థితుల్లో సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు ఉచిత పంటల బీమా పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 2019 సీజన్ లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారం చెల్లించారు.

గతంలో పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులకు భారం కాకూడదని, పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలని చెప్పారు. 

గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించేవని, రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతోందని అన్నారు. భూమి సాగు చేస్తూ, ఈ-క్రాప్ లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాను పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరపున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయినప్పుడు బీమా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం  ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ ప్రక్రియలో పూర్తి పాదర్శకత పాటిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.  

 

Leave a Comment