నీళ్లు తాగాలని చెప్పిన రోనాల్డో.. కోకాకోలాకు రూ.30 వేల కోట్లు నష్టం..!

స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో చేసిన పనికి ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కోకాకోలా కంపెనీ భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. యూరోకప్ లో హంగరీతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోనాల్డో తన ముందు ఉన్న కోకాకోలా బాటిల్స్ ను తీసి పక్కన పెట్టాడు. తర్వాత వాటర్ బాటిల్ ని చూపిస్తూ వాటి కంటే నీళ్లు తాగడానికి ప్రాధాన్యత ఇవ్వండి అని అన్నాడు.  

రోనాల్డో చేసిన ఈ కామెంట్  ఎఫెక్ట్ తో కోకాకోలా కంపెనీకి భారీ నష్టం తీసుకొచ్చింది. కోకాకోలా స్టాక్ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకాకోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో 30 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయింది. 

కాగా  క్రిస్టియానో రోనాల్డో తీరుపై కోకాకోలా కంపెనీ స్పందించింది. ఎవరికి నచ్చిన డ్రింక్ లు వాళ్లు తాగుతారని, ఎవరి టేస్టులు వారికి ఉంటాయని బదులిచ్చింది. అవసరాలను బట్టి ఎవరికి నచ్చిన డ్రింక్ లు వాళ్లు తాగుతారని చెప్పింది.  

 

Leave a Comment