ఏపీలో సంక్షోభం తలెత్తబోతోంది : ఎంపీ రఘురామ కృష్ణరాజు

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తబోతోందని, రెండు మూడు నెలల్లో రాష్ట్రపతి పాలన విధించి స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కుక్కతో పోల్చడం చాలా తప్పని చెప్పారు. 

మంత్రిపై చర్యలు కోరుతూ నిమ్మగడ్డ కూడా ఫిర్యాదు చేశారని, కానీ కొడాలి నానిని ఓ పనిముట్టుగా, రాజ్యాంగ వ్యవస్థల హత్యకు ఆయుధంగా వాడుకున్నారని అన్నారు. తెర వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నది సీఎం జగనే అని విమర్శించారు. నాని కేవలం హత్యకు వాడిన కత్తి మాత్రమే అన్నారు. నానిని ఒక ఆయుధంగా నిమ్మగడ్డపైకి ప్రయోగించారన్నారు. 

ఒకరి తర్వాత ఒకరుగా పద్ధతి ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తున్నారని, ఇది కచ్చితంగా రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా నిమ్మగడ్డతో రాద్ధాంతానికి స్వస్తి పలకాలని అన్నారు. కరోనాతో చనిపోయిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆ కుటుంబానికి అన్యాయం చేసి తన వ్యక్తిగత వైద్యుడైన గురుమూర్తికి సీఎం జగన్ టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు.  

Leave a Comment