రైతు ఉద్యమం అంతర్గత వ్యవహారమా?.. క్రికెటర్ సందీప్ శర్మ దిమ్మదిరిగే కౌంటర్..!

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం రైతులు రెండు నెలలుగా శాంతియుత నిరసనలు చేపడుతున్నారు. అమెరికా పాప్ సింగర్ రిహానా కూడా రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘మనం దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు?’ అంటూ రిహానా ట్వీట్ చేశారు. రిహానాకు ట్విట్టర్ లో 100 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 

 అయితే రైతులు రెండు నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్న నోరు మెదపని భారత సినీ, క్రికెట్ ప్రముఖులు రిహానాపై ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. అది భారత అంతర్గత వ్యవహారమని, ఇతురుల జోక్యం దేశ సార్వభౌమత్వానికి ముప్పుగానే పరిగణిస్తామని ట్వీట్ చేశారు. 

అయితే భారత అంతర్గత వ్యవహారాలు అంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శఆఖ ట్వీట్ పై భారత్ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ సందీప్ శర్మ తిరులేని కౌంటర్ ఇచ్చాడు. సందీప్ శర్మ ఏమన్నాడంటే..‘ భారత రైతులకు మద్దతు తెలపాలని ప్రపంచానికి పాప్ గాయని రిహాన కోరింది. ఎంతో మంది, భారత విదేశీ మంత్రిత్వ శాఖ రిహానాను విమర్శించింది’ అని తెలిపాడు. 

‘అది భారత అంతర్గత వ్యవహారమని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ లాజిక్ ప్రకారం జర్మనీలో యూధులను నాజీ పాలకులు ఊచకోత కోయడాన్ని ఎవరూ తప్పుపట్టకూడదు. పాకిస్తాన్ లో అహ్మదీస్, హిందూవులు, సిక్కులు, క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను ఎవరూ ప్రశ్నించకూడదు. భారత్ ఆవల ఎవరూ ఇక్కడ ముస్లింలపై జరుగుతున్న దాడులు, 1984 సిక్కుల ఊచకోత గురించి మాట్లాడకూడదు‘ అంటూ సందీప్ శర్మ తెలిపాడు. 

‘ఆ లాజిక్ ప్రకారం దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష.. ప్రభుత్వమే నల్ల జాతీయుల పట్ట వివక్షను పాటించడం గురించి మనం ఎవరూ మాట్లాడకూడదు. బర్మాలో రోహింగ్యా ముస్లింలపై హింస గురించి ఎవరూ మాట్లాడకూడదు‘ అంటూ సందీప్ శర్మ గట్ట కౌంటర్ ఇచ్చాడు.  కాగా బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి కూడా ఈ వ్యవహారంపై స్పందించాడు. తాను చిన్నప్పుడు కీలుబొమ్మలాట చూడలేదని, అది చూసేందుకు తనకు 35 ఏళ్లు పట్టిందని చెప్పాడు. 

Leave a Comment